బొమ్మ తుపాకీ అనుకుని..అమ్మను కాల్చింది! | dummy gun chaild firing | Sakshi
Sakshi News home page

బొమ్మ తుపాకీ అనుకుని..అమ్మను కాల్చింది!

Published Mon, Jun 18 2018 6:33 AM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

dummy gun chaild firing - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓ బాలిక నిజమైన తుపాకీని బొమ్మగా పొరబడి, దాంతో తన తల్లిని కాల్చింది. హుగ్లీ జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో బాలిక తల్లి తీవ్రంగా గాయపడగా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆదివారం ఉదయం కకోలీ జన అనే మహిళకు తమ ఇంటి పెరట్లో ఈ తుపాకీ దొరికింది. దానిని బొమ్మగా భావించిన ఆమె తన కూతురికి ఆడుకోడానికి ఇచ్చింది. బాలిక ఆడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా తుపాకీ నుంచి ఓ బుల్లెట్‌ మహిళ వీపు భాగంలోకి దూసుకుపోయింది. పోలీసులు బాలికను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చిన్నారి షాక్‌లో ఉందని పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement