
సమస్యను పరిశీలించి బాలుడితో మాట్లాడుతున్న జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి
బౌద్ధనగర్: ‘సార్ కేటీఆర్.. మా ఇంటి ముందు ఫుట్‌పాత్ సరిగా లేకపోవడంతో నడవలేక ఇబ్బందులు పడుతున్నాము..’అంటూ కార్తికేయ అనే రెండో తరగతి చదువుతున్న బాలుడు చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. దాన్ని సికింద్రాబాద్ జోనల్ కమిషనర్‌కు రీట్వీట్ చేయడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు.
నడవలేకపోతున్నాం..
బౌద్ధనగర్ రామాలయం వెనుకవీధిలో ఫుట్‌పాత్ సరిగా లేకపోవడంతో పిల్లలు నడవలేక ఇబ్బందులు పడుతున్నారని కార్తికేయ అనే బాలుడు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌కు సమస్యను వివరించాడు. స్పందించిన కేటీఆర్ అక్కడికి వెళ్లి సమస్య పరిష్కరించి.. ట్వీట్ చేసిన బాలుడితో కలిసి దిగిన ఫొటోను తనకు ట్విట్టర్‌లో పోస్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి సంబంధిత ఏఈ జీహెచ్‌ఎంసీ సిబ్బందితో కలిసి సమస్య నెలకొన్న ప్రాంతాన్ని చేరుకొని బాలుడ్ని కలిశారు.
సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బాలుడికి హామీ ఇచ్చారు. అనంతరం, బాలుడితో కలిసి దిగిన ఫొటోను మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో పంపించారు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్‌కు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు బాలుడి కుటుంబసభ్యులతో పాటు బస్తీవాసులు ధన్యవాదాలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment