ప్రియుడితో కలిసి నాలుగేళ్ల చిన్నారి హత్య | four years old kid killed by mother | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 4 2015 6:11 PM | Last Updated on Fri, Mar 22 2024 10:47 AM

వివాహేత సంబంధానికి అడ్డంకిగా ఉందని కన్న కూతురునే కడతేర్చింది ఓ తల్లి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మల్యాల వాగులో మంగళవారం వెలుగు చూసింది. వివరాలు.. వరంగల్ జిల్లా చిట్యాల మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన పైడయ్య, రాధ దంపతులకు నందిని(4) సంతానం. కాగా, పైడయ్య తమ్ముడు రవీంద్రతో రాధకు వివాహేతర సంబంధం ఏర్పడింది. రవీంద్రకు అప్పటికే వివాహమైంది. నలుగురు సంతానం కూడా. అయితే వివాహేతర సంబంధం ఏర్పడటంతో రవీంద్ర, రాధ లిద్దరూ నెల రోజుల క్రితం పాప నందినిని తీసుకొని గ్రామం నుంచి వెళ్లిపోయారు. దాంతో రాధ భర్త పైడయ్య పోలీసులను ఫిర్యాదు చేశాడు. తన భార్య, కుమార్తె కనిపించడం లేదని చిట్యాల పోలీస్‌స్టేషన్‌లో గత నెలలో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వారిద్దరి ఆచూకీ కోసం గాలించారు. చివరికి వారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో ఉన్నట్లు వారం రోజుల క్రితం పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్నే జమ్మికుంట పోలీసులు చిట్యాల పోలీసులకు తెలిపారు. వారి వద్ద పాప లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో రవీంద్రను విచారించడంతో అసలు విషయం బయటపడింది. తమ సంబంధానికి పాప అడ్డంగా ఉందని 30 రోజుల క్రితమే చంపేశామని ఒప్పుకున్నాడు. పాపను చంపి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మాల్యాలవాగులో పూడ్చిపెట్టినట్లు పోలీసులు విచారణలో రవీంద్ర ఒప్పుకున్నాడు. పోలీసులు తవ్వకాల్లో పాప మృతదేహం బయటపడింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement