కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు కొంత విరామం దొరికింది. ప్రపంచ దేశాల ఒత్తిడి మేరకు రష్యా యుద్ధానికి తాత్కాలికంగా విరామం ప్రకటించింది. ఈ క్రమంలో పౌరుల తరలింపునకు రష్యా అవకాశం కల్పించింది. కాగా, పది రోజులుగా రెండు దేశాల మధ్య భీకర పోరు నడుస్తోంది. రెండు దేశాల బలగాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. వేల సంఖ్యలో సైనికులు, వందల సంఖ్యలో పౌరులు మృత్యువాతపడ్డారు.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌కు చెందిన ఓ సైనికుడు తన ఇంటికి వెళ్లి కుమారుడిని కౌగిలించుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కన్నీరు పెట్టిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ సైనికుడు తన ఇంటి వెళ్లగా.. సోల్జర్‌ను చూసిన అతడి కొడుకు పరుగు తీస్తూ అతడిని హత్తుకుంటాడు. ఈ సమయంలో అతడు కన్నీరు పెట్టడం అందరినీ ఆవేదనకు గురి చేసింది. కాగా, ఈ వీడియో ఉక్రెయిన్‌లో యుద్ద సమయంలో సైనికుల వేదనకు అద్ధం పడుతున్నాయి.
మరోవైపు.. రష్యా సైనికులు సైతం తమకు యుద్దం చేయడం ఇష్టం లేదన్న ఉద్దేశ్యంతో వారి ట్యాంకర్లకు వారే మంటలు అంటించుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూ.. కన్నీరు పెట్టిన వీడియోలు అందరినీ కలచి వేశాయి.
Comments
Please login to add a commentAdd a comment