న్యూఢిల్లీ: చైనా చెప్పేదొకటి, చేసేదొకటి అన్నదానికి రోజు కొక సాక్ష్యం వెలుగులోకి వస్తూనే ఉంది. లద్దాఖ్ సరిహద్దుల్లోని గల్వాన్ లోయ సమీపంలో చైనా సైన్యం 423 మీటర్ల మేరకు భారత భూభాగంలోకి వచ్చినట్టుగా ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వెల్లడవుతోంది. జూన్ 25 నాడు తీసిన చిత్రాల్లో మొత్తం చైనాకు చెందిన 16 టెంట్లు , మరో అతి పెద్ద శిబిరం, 14 వాహనాలు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చినట్టుగా జాతీయ మీడియా ప్రసారం చేసిన ఫోటోల్లో స్పష్టంగా తెలుస్తోంది.
1960–61లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రచురించిన ఒక డాక్యుమెంట్ ప్రకారం సరిహద్దుల్లో ఎవరి భూభాగం ఎంతవరకో అన్నది ఒక స్పష్టమైన వివరణ ఉంది. ఇరుదేశాలు సరిహద్దు భూభాగాలపై ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత రూపొందించిన డాక్యుమెంట్ ఇది. కానీ చైనా ఆ ఒప్పందాన్ని తుంగలోకి తొక్కింది. గల్వాన్ నదికి ఉత్తరంగా భారత్ భూభాగాన్ని 423 మీటర్ల మేరకు ఆక్రమించుకొని చైనా దళం తిష్టవేసుకొని కూర్చుంది.
Comments
Please login to add a commentAdd a comment