బీజింగ్: భారత్-చైనా సరిహద్దుల మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తూర్పు లద్దాఖ్‌లోని 20 ప్రధాన పర్వత ప్రాంతాలపై భారత సైన్యం ఆధిపత్యం సాధించడంతో ఆయా ప్రాంతాల్లో చైనా అదనపు బలగాలను మెహరించింది. ఈ నేపథ్యంలో ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో భారత సరిహద్దు ప్రాంతమైన లద్దాఖ్‌కు బస్సులో వెళుతున్న చైనా జవాన్లు.. మనసులో బాధను బయటకు కక్కలేక, మింగలేక తెగ అవస్థ పడుతున్నారు. అదే సమయంలో భావోద్వేగంగా సాగే 'గ్రీన్ ఫ్లవర్స్ ఇన్ ద ఆర్మీ' అనే మిలిటరీ పాటకు గొంతు కలుపుతూ కన్నీళ్లు కార్చారు. ఈ వీడియో తైవాన్ మీడియా కంటపడటంతో డ్రాగన్ దేశానికి తనదైన శైలిలో చురకలు అంటించింది. (చదవండి: చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్)
"సరిహద్దులో గస్తీ కాయడానికి వెళ్తున్న చైనా జవాన్లు భారత సైన్యంతో తలపడేందుకు భయపడి ఏడుస్తున్నారు" అంటూ కథనాలు రాసింది. అసలే భారత్ పేరు వింటేనే తోక తొక్కిన తాచులా లేస్తున్న చైనాకు ఈ కథనాలు అస్సలు మింగుడు పడలేదు. దీంతో తైవాన్ కథనాలను ఖండిస్తూ.. తమ యువ సైనికులు అప్పుడే వారి కుటుంబాలకు తొలిసారిగా వీడ్కోలు పలికి వస్తున్నందువల్లే కంటతడి పెట్టుకున్నారని చైనా వివరణ ఇచ్చింది. పైగా వారు పాడుతుంది చైనా మిలిటరీ సాంగ్ కావడంతో సహజంగానే ఉద్వేగానికి లోనయ్యారని స్పష్టం చేసింది. ఇక ఈ వీడియోను అన్హూయ్ ప్రావిన్స్‌లోని ఫుయాంగ్ రైల్వే స్టేషన్ సమీపంలో చిత్రీకరించారు. (చదవండి: ఇండియన్ అవెంజర్స్ వచ్చేశారు)
上车后被告知上前线
— 自由的鐘聲🗽 (@waynescene) September 20, 2020
炮灰们哭的稀里哗啦!pic.twitter.com/wHLMqFeKIa
Comments
Please login to add a commentAdd a comment