Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో దాడులు.. 25 మంది దుర్మరణం | Russia-Ukraine War: Strike on busy market kills 25 in Russian-held Donetsk | Sakshi
Sakshi News home page

Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో దాడులు.. 25 మంది దుర్మరణం

Published Mon, Jan 22 2024 5:09 AM | Last Updated on Mon, Jan 22 2024 5:09 AM

Russia-Ukraine War: Strike on busy market kills 25 in Russian-held Donetsk - Sakshi

కీవ్‌: రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌ భూభాగంలో ఆదివారం ఒక మార్కెట్‌పై జరిగిన దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌ సేనలే ఈ దాడులకు తెగబడినట్లు రష్యా ఆరోపిస్తోంది. దీనిపై ఉక్రెయిన్‌ ఇంకా స్పందించలేదు. డోనెట్స్క్‌ నగరం సమీపంలోని టెక్‌స్టిల్‌చిక్‌ ప్రాంత మార్కెట్‌పై జరిగిన ఈ దాడిలో 20 మందికిపైగా గాయపడ్డారు.

మరోవైపు ఆదివారమే రష్యాలోని కింగ్‌సెప్‌ జిల్లాలోని ఉస్ట్‌–లూగా పోర్ట్‌ రసాయన రవాణా టెరి్మనల్‌ వద్ద రెండు భారీ పేలుళ్లు, తర్వాత భారీ అగి్నప్రమాదం జరిగిన నేపథ్యంలో ఈ సంఘటనలను రష్యా, ఉక్రెయిన్‌ల పరస్పర దాడులుగా అంతర్జాతీయ మీడియా అభివరి్ణస్తోంది. నాలుగు ఉక్రెయిన్‌ డ్రోన్లు దాడి చేయడం వల్లే రసాయన రవాణా టెర్మినల్‌ వద్ద గ్యాస్‌ ట్యాంక్‌ పేలిందని రష్యా స్థానిక మీడియా ఆరోపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement