సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో నీట్ మెడికల్ కౌన్సిలింగ్ వెంటనే నిర్వహించాలని బీఆర్‌ఎస్ విద్యార్థి సంఘం(బీఆర్‌ఎస్వీ) నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం(సెప్టెంబర్ 15) బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ముందు ధర్నా నిర్వహించారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
మినిస్టర్ క్వార్టర్స్‌కు వెళ్లేందుకు యత్నంచిన మరికొందరు బీఆర్‌ఎస్వీ నేతలను బీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణభవన్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు.ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్‌ఎస్వీ నేతలకు వాగ్వాదం జరిగింది. పోలీసులను నెట్టివేసి వెళ్లేందుకు బీఆర్‌ఎస్వీ నేతలు ప్రయత్నించడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మీడియాతో మాట్లాడారు.
‘తెలంగాణ స్థానిక విద్యార్థులకే మెడికల్ సీట్లు కేటాయించాలి. ఇతర రాష్ట్ర విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీట్లు అమ్ముకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నరసింహ కుట్ర చేస్తున్నారు. జీవో నెంబర్ 33 వల్ల తెలంగాణ స్థానిక విద్యార్థులకు నష్టం జరుగుతుంది. తెలంగాణలో పుట్టిన ప్రతి విద్యార్థి తెలంగాణ స్థానికుడే. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 33 పై సుప్రీంకోర్టులో వేసిన అప్పీలను ఉపసంహరించుకోవాలి’అని గెల్లు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి.. ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment