
మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించిన ఏబీవీపీ, అరెస్ట్
హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్మెంట్ను తక్షణమే చెల్లించాలని, రీయింబర్స్మెంట్కు ఆధార్ కార్డుతో అనుసంధానం చేయవద్దంటూ ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేశారు. పెండింగ్ స్కాలర్ షిప్లను చెల్లించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించి ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా మినిస్టర్స్ క్వార్టర్స్లోనికి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని గోల్కొండ పోలీస్ స్టేషన్కు తరలించారు.