
సమీనాబేగం
రాజేంద్రనగర్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ గృహిణి కనిపించకుండా పోయిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శాస్త్రీపురం ఓవైసీ హిల్స్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రషీద్ భార్య సమీనాబేగం(21) గృహిణి. ఇంట్లో అందరూ నిద్రకు ఉపక్రమించిన తరువాత ఇంట్లోని బంగారం తీసుకుని ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఉదయం లేచి చూసేసరికి సమీనాబేగం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాలు, స్నేహితులు, బంధువుల వద్ద వాకబు చేసినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment