
జయశ్రీ (ఫైల్)
కీసర: ఓటు వేసేందుకు బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ ప్రకాష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చీర్యాల గ్రామం, ఇందిరమ్మ కాలనీకి చెందిన జయశ్రీ దిశా పాఠశాల్లో కేర్‌టేకర్‌గా పనిచేసేది. సోమవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆందోళనకు గురైన జయశ్రీ భర్త రాజు మంగళవారం ఉదయం కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.