
కొమ్మాది (భీమిలి)విశాఖపట్నం: ఒకప్పుడు హాస్యనటుడు షకలక శంకర్‌కు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసిన అనుభవంతో సినిమాలవైపు అడుగులు వేస్తున్నాడు విశాఖ జిల్లా శ్రీహరిపురానికి చెందిన పోతిన రమేష్ జబర్దస్త్‌లో స్క్రిప్ట్ రైటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ అనుభవంతో మొట్టమొదటిసారిగా హర్రర్ లవ్ స్టోరీ అటవీ సినిమాతో తన సినీ ప్రస్థానం ప్రారంభించి ప్రస్తుతం పలువురు ప్రముఖ కథానాయకులతో ఊరమాస్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
చదవండి: నడిరోడ్డుపై హీరోయిన్‌ను జుట్టుపట్టుకుని కొట్టిన హీరో భార్య
అంతే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే తానే వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో సినీ పరిశ్రమవైపు అడుగులు వేస్తున్నానని, ఊరమాస్ సినిమా 90 శాతం విశాఖలో చిత్రీకరించానని చెప్పారు. విశాఖలో షూటింగ్‌కు అనుకూలమైన లొకేషన్లతో పాటు, అనేక మంది మంచి నటులు ఉన్నారని, సినీ పరిశ్రమ విశాఖ తరలి వస్తే ఎందరో నటులకు, టెక్నీషియన్స్‌కు మరింత ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రియల్‌ఎస్టేట్ మాఫియా, ప్రేమ అనే అంశాలతో తెరకెక్కిస్తున్న ఊరమాస్ సినిమా 5 భాషల్లో నిర్మిస్తున్నామని, ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి అయినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment