
అజ్జరపు వెంకట హేమశేఖర్
తగరపువలస(విశాఖపట్నం జిల్లా): భీమిలి మండలం తాళ్లవలస నారాయణ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో 9వ తరగతి విద్యార్థి అజ్జరపు వెంకట హేమశేఖర్(14) మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో స్కూల్ నుంచి అదృశ్యమయ్యాడు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి నారాయణ విద్యా సంస్థల హాస్టల్‌లో ఉంటున్నాడు.
స్కూల్ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి తిరిగి రాకపోవడంతో తండ్రి వెంకట సాయిరమణ ఆందోళన వ్యక్తం చేస్తూ భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంధువులు, చుట్టుపక్కల స్నేహితుల ఇళ్లలోనూ వెతికారు. దీనిపై స్కూల్ యాజమాన్యం నోరు మెదపడం లేదని కుటుంబ సభ్యులు వాపోయారు. స్కూల్ నుంచి బయటకు వెళ్లిన సమయంలో హేమశేఖర్ బ్లూ జీన్ ఫ్యాంటు, గళ్ల చొక్కా, మాస్క్ ధరించి ఉన్నట్టు స్కూల్ సీసీ కెమెరాల్లో నమోదయింది. భీమిలి హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. సెల్‌ఫోన్ చార్జర్ వైర్‌తో ఆమె పిల్లలపై..