20న వైఎస్సార్‌, విశాఖ జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన | CM YS Jagan Visits YSR And Visakha Districts On February 20th | Sakshi
Sakshi News home page

20న వైఎస్సార్‌, విశాఖ జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన

Published Fri, Feb 18 2022 7:53 PM | Last Updated on Fri, Feb 18 2022 9:58 PM

CM YS Jagan Visits YSR And Visakha Districts On February 20th - Sakshi

సాక్షి, అమరావతి: ఎల్లుండి(ఆదివారం) వైఎస్సార్‌ జిల్లా, విశాఖపట్నం జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కడప చేరుకోనున్న సీఎం, అనంతరం పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.

చదవండి: రాష్ట్రపతి పర్యటనలో మార్పులు

ఆ తర్వాత కడప రింగ్‌ రోడ్‌ జయరాజ్‌ గార్డెన్స్‌లో డిప్యూటీ సీఎం ఎస్‌బి.అంజాద్‌ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. అదే రోజు సాయంత్రం 4.45 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి నేవల్‌ ఎయిర్‌స్టేషన్, ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement