
పోలీస్ బందోబస్తు మధ్య పరీక్ష సామగ్రిని వాహనంలో తరలిస్తున్న అధికారులు
సాక్షి, విశాఖపట్నం: గ్రామ, వార్డు సచివాలయాల్లో కొలువులకు సంబంధించిన పరీక్షలకు తెరలేచింది. 19 కేటగిరీల్లో కల్లా అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలకు.. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు.. అత్య
ధిక కేంద్రాల్లో ఆదివారమే పరీక్ష రాయనున్నారు. దీంతో అధికారులకూ ఇదో పరీక్షగా మారింది. జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, జాయింట్ కలెక్టర్ శివశంకర్, జీవీఎంసీ కమిషనర్ సృజన, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ, జడ్పీ సీఈవో బీవీ రమణమూర్తి తదితర ఉన్నతాధికారులంతా ఈ ఏర్పాట్ల పర్యవేక్షణలో కొద్దిరోజులుగా తలమునకలై ఉన్నారు. అభ్యర్థులు కూడా ప్రభుత్వ కొలువు దక్కించుకునేందుకు ఇన్నాళ్లూ రేయింబవళ్లు కష్టపడ్డారు. ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా స్వీయ ప్రతిభనే నమ్ముకొని ప్రశాంతంగా పరీక్షకు హాజరుకావాలని అధికారులు సూచిస్తున్నారు.
పారితోషికం రూ.1.18 కోట్లు విడుదల...
తొలిరోజైన ఆదివారం మొత్తం 10,200 మంది అధికారులు, ఉద్యోగులు, ఇతరత్రా సిబ్బంది పరీక్షల నిర్వహణలో పాలుపంచుకోనున్నారు. వారికి పారితోషికం కూడా అదే రోజు చెల్లించేందుకు రూ.1.18 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని చీఫ్ సూపరింటెండెంట్‌లకు శనివారమే అందజేశారు. ఆదివారం ఉదయం 35 మంది, మధ్యాహ్నం 11 మంది క్లస్టర్ అధికారులుగా వ్యవహరించనున్నారు. అలాగే రూట్ అధికారులుగా ఉదయం 132 మంది, మధ్యాహ్నం 27 మంది, సెంటర్ ప్రత్యేకాధికారులుగా ఉదయం 406 మంది, మధ్యాహ్నం 46 మంది, చీఫ్ సూపరింటెండెంట్‌లుగా ఉదయం 406 మంది, మధ్యాహ్నం 46 మంది, అదనపు చీఫ్ సూపరింటెండెంట్‌లుగా ఉదయం 226 మంది, మధ్యాహ్నం 57 మంది, హాల్ సూపరింటెండెంట్‌లుగా 1,439 మంది, మధ్యాహ్నం 300 మంది వ్యవహరించనున్నారు. ఇక ఇన్విజిలేటర్ల విషయానికొస్తే ఉదయం 6,325 మందిని, మధ్యాహ్నం 1,218 మందిని నియమించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి నుంచి కార్యాచరణ ప్రారంభించనున్నాయి. వాటి ద్వారా ప్రజలకు చేరువలోనే వివిధ రకాలైన సేవలు అందించేందుకు వీలుగా జిల్లాలో 19 కేటగిరీల్లో మొత్తం 10,872 మంది ఉద్యోగులను నియమించ నున్నారు. ఈ కొలువులను దక్కించుకునేందుకు మొత్తం 2,35,614 మంది పోటీపడుతున్నారు. జిల్లాలోని 39 మండలాల్లో ఉన్న 925 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటుకానున్న గ్రామ సచివాలయాల్లో 7,789 పోస్టులు, అలాగే మహావిశాఖ నగరపాలక సంస్థతో పాటు నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లోని వార్డు సచివాలయాలకు 3,083 పోస్టులు ఉన్నాయి.
తొలిరోజే కీలకం...
తొలిరోజైన ఆదివారం ఉదయం పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్ 5) 404 పోస్టులు, మహిళా పోలీసు, వార్డు సంక్షేమం–విద్యా కార్యదర్శి 1281 పోస్టులు, వార్డు పరిపాలనా కార్యదర్శి 452 పోస్టులు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 739 కలిపి మొత్తం 2,876 మంది పోస్టులకు మొత్తం 1,31,817 మంది పరీక్ష రాయనున్నారు. వారి కోసం 406 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలా గే మధ్యాహ్నం పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్ 6) డిజి టల్ అసిస్టెంట్ 739 పోస్టులకు సంబంధించి మరో 27,775 మంది పరీక్ష రాయనున్నారు. వారి కోసం 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలిరోజు రెండు పూటలా కలిపి మొత్తం 1,59,592 మంది పరీక్ష రాయనున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు ఈ పరీక్షల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా చూడాలని అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
పోలీస్ స్టేషన్లకు చేరిన మెటీరియల్...
జిల్లాలో 406 పరీక్షా కేంద్రాలకు ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 6 గంటలకల్లా ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్లు, ఇతర మెటీరియల్ అంతా అందే ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రమైన విశాఖపట్నంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రధాన స్ట్రాంగ్ రూమ్ నుంచి శనివారం ఉదయమే 43 ప్రత్యేక వాహనాల్లో పోలీసు భద్రత మధ్య మెటీరియల్ చేరవేశారు. జిల్లాలోని 35 క్లస్టర్లవారీగా క్లస్టర్‌కు ఒకటి చొప్పున పోలీసుస్టేషన్‌ను స్ట్రాంగ్‌రూమ్‌గా ఏర్పాటు చేశారు. అలాగే మధ్యాహ్నం పరీక్షకు సంబంధించి 11 స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు.
చంద్రంపాలెంలో 755 మంది దివ్యాంగులు..
రాష్ట్రంలోనే పెద్ద పాఠశాల అయిన చంద్రంపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 1000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. వీరిలో 755 మంది దివ్యాంగులు ఉన్నారు. కాగా 65 శాతం వికలాంగత్వం దాటిన 94 మందికి సహాయకులు తెచ్చుకోవడానికి అవకాశం కల్పించారు. వీరు పరీక్ష రాయడానికి వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
3800 మందితో బందో‘మస్తు’
గ్రామ సచివాలయ పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ట్రాఫిక్ పరంగా ఎటువంటి సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
-ఈ పరీక్షల కోసం నగరంలో 266 సెంటర్లను ఏర్పాటు చేయగా.. సుమారు 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
-నగరవ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా 800 మంది ట్రాఫిక్ పోలీసులు విధులకు సిద్ధమయ్యారు.
-శనివారం సాయంత్రానికే పరీక్షాపత్రాలు నగరంలోని క్లస్టర్లకు చేరుకున్నాయి. వీటిని ఆదివారం ఉదయం పరీక్షా కేంద్రాలకు పటిష్టమైన బందోబస్తుతో చేరవేస్తారు.
-పరీక్షా కేంద్రంలో 200 మంది అభ్యర్థులుంటే వారికి బందోబస్తుగా నలుగురు పోలీసుల్ని ఏర్పాటు చేశారు. అభ్యర్థుల సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉన్న సెంటర్లలో 8 మంది వరకు పోలీసులు విధులకు సిద్ధమయ్యారు.
-ప్రతి పరీక్షాకేంద్రం వద్దా ఒక హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక మహిళా కానిస్టేబుల్ విధులు నిర్వర్తించేలా ప్రణాళిక రూపొందించారు.
-నిషేధిత వస్తువుల్ని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకుండా తనిఖీలు నిర్వర్తిస్తారు.
-నగరంలోని సంబంధిత పోలీస్‌స్టేషన్ పరిధిలో గల పరీక్షా కేంద్రాల్లో సీఐలు, ఎస్‌ఐలతో పాటు సబ్‌డివిజన్ ఏసీపీలు కూడా వారి పరిధిలోని కేంద్రాల్లో బందోబస్తును పర్యవేక్షిస్తారు.
-పరీక్షా కేంద్రాల అడ్రస్ తెలియకపోవడం, ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా డెస్క్‌లు ఏర్పాటు చేశారు.
విశాఖ జిల్లా పరిధిలో...
విశాఖ జిల్లా పరిధిలో 140 సెంటర్లను ఏర్పాటు చేశారు. 1000 మందికి పైగా పోలీసులు బందోబస్తుకు సిద్ధమయ్యారు. ఒక్కో పరీక్షా కేంద్రంలో 400 లోపు ఉంటే ఒక హెడ్ కానిస్టేబు ల్, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక మహిళా కానిస్టేబుల్ బందోబస్తు నిర్వహించనున్నారు. విశాఖ జిల్లా పరిధిలో వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పరీక్షలు జరుగుతున్నాయి. మహిళా అభ్యర్థుల్ని తనిఖీ చేసేందుకు అంగన్వాడీ టీచర్ల సాయం తీసుకోనున్నారు.
105 ప్రత్యేక బస్సులు:
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): గ్రామ సచివాలయ పరీక్షలకు ఏపీఎస్‌ఆర్టీసీ 105 ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఇవి కాకుండా రెగ్యులర్‌గా నడిచే 800 బస్సులు కూడా ఆయా రూట్లలో అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి. ఎక్స్‌ప్రెస్ సర్వీసులు అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాల వద్ద ఆపనున్నారు. నగర పరిధిలో దాదాపు 60 మంది అధికారులు పర్యవేక్షించనున్నారు.
పాయింట్ల వద్దే వివరాలు...
బస్సుల రూట్ల వివరాలకు సంబంధించి ద్వారకా బస్‌స్టేషన్ మేనేజర్‌ను (99592 25602) సంప్రదించవచ్చు. బస్సుల సమయాలు, సెంటర్ వివరాలను 222 పా యింట్, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్, మ ద్దిలపాలెం, ఎన్‌ఏడీ జంక్షన్, గాజువాక 400 పాయింట్, గాజువాక 600 పాయిం ట్, అనకాపల్లి, చోడవరం, యలమంచలి, నర్సీపట్నం, పాడేరు ట్రాఫిక్ పాయింట్లలో గల హెల్ప్ డెస్క్‌ల్లో తెలుసుకోవచ్చు.
డిపో మేనేజర్ల నంబర్లు...
మద్దిలపాలెం: 99592 25597, వాల్తేరు: 99592 25590
గాజువాక: 99592 25591, కూర్మన్నపాలెం: 99592 25593
సింహాచలం: 99592 25592, పాడేరు: 94406 28092
నర్సీపట్నం: 99592 25596, విశాఖపట్నం: 99592 25594
అనకాపల్లి–99592 25595, మధురవాడ: 89782 00455
ఏటీఎమ్/ఆర్టీసీ కాంప్లెక్స్: 91001 09731
ప్రత్యేక బస్సులు నడిచే ప్రాంతాలు..
-ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వయా పెందుర్తి మీదుగా ఆనందపురం వరకు 5 బస్సులు (ఉదయం 7.30 నుంచి 8.30 వరకు)
-పెందుర్తి నుంచి ఆనందపురం వరకు 11 బస్సులు(ఉదయం 8 నుంచి 9)
-నర్సీపట్నం నుంచి చింతపల్లికి 5 బస్సులు(ఉదయం 7.30 నుంచి 8.30)
-పాడేరు నుంచి చింతపల్లికి 3 బస్సులు(ఉదయం 7.30 నుంచి 8.30)
-అనకాపల్లి నుంచి దేవరాపల్లికి 2 బస్సులు(ఉదయం 7.30 నుంచి 8.30)
-గాజువాక నుంచి పెదగంట్యాడకు 3 బస్సులు(ఉదయం 8 నుంచి 9)
-ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అప్పుఘర్‌కు(వయా ఏయూ) 6 బస్సులు(ఉదయం 7 నుంచి 9)
-పాత గాజువాక నుంచి దువ్వాడకు 5 బస్సులు(ఉదయం 6.30 నుంచి 8.30)
-మద్దిలపాలెం నుంచి పాత గాజువాకకు 10 బస్సులు(ఉదయం 7 నుంచి 9)
-పాత గాజువాక నుంచి అచ్యుతాపురం/యలమంచిలి వరకు 10 బస్సులు (ఉదయం 6.30 నుంచి 8.30)
-పాత గాజువాక నుంచి బెహరకు 5 బస్సులు(ఉదయం 7.30 నుంచి 8.30)
-ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కొమ్మాదికి 5 బస్సులు(ఉదయం 7.30 నుంచి 8.30)
-ఎన్‌ఏడీ నుంచి కె.కోటపాడుకు 4 బస్సులు(ఉదయం 7.30 నుంచి 8.30)
-విశాఖపట్నం నుంచి అరకు ఒక బస్సు(ఉదయం 4.30 గంటలకు)
-ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తగరపువలసకు 5 బస్సులు(ఉదయం 7.30 నుంచి 8.30)
-ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాకమర్రికి 5 బస్సులు(ఉదయం 7.30 నుంచి 8.30)
-ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి భీమిలి వరకు 10 బస్సులు (ఉదయం 7.30 నుంచి 8.30)
-ఎన్‌ఏడీ కొత్తరోడ్డు నుంచి పెందుర్తికి 5 బస్సులు (ఉదయం 7.30 నుంచి 9 )
Comments
Please login to add a commentAdd a comment