
సంఘటన స్థలంలో మహిళ
నర్సీపట్నం: మద్యం మత్తులో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. తమ ద్విచక్రవాహనానికి సైడు ఇవ్వలేదన్న సాకుతో ఓ ఆటో డ్రైవర్‌ను కొట్టడమే కాకుండా అడ్డు వచ్చిన అతని భార్య పట్ల దురుసుగా ప్రవర్తించి, ఆమె చీర లాగేశారు. పట్టణ సీఐ స్వామినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. కోటవురట్ల మండలం యండపల్లికి చెందిన మూర్తి నానిబాబు(ఆటోడ్రైవర్),భార్య రాజేశ్వరి, సోదరుడు అప్పలరాజు కలసి బుధవారం నర్సీపట్నంఏరియా ఆస్పత్రికి బయలుదేరారు. పూటు గా మద్యం తాగిన బొడగ రామకృష్ణ , ఎలిశెట్టి నాగేశ్వరరావులు బైక్‌పై వస్తూ అబీద్‌సెంటర్ వద్ద ఆటోను ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించారు. ట్రాఫిక్ సమస్య వల్ల ఆటో డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన ఆ యువకులు కొంతదూరం వచ్చిన తరువాత ఆటోను ఆపి డ్రైవర్ నానిబాబును ఆటోలోంచి కిందకు దించి తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో ఆటో డ్రైవర్ భార్య రాజేశ్వరి అడ్డుకోగా ఆమెను కూడా ఇబ్బంది పెట్టారు. చీరలాగేడంతో పాటు కులం పేరుతో దూషించారు. బాధితురాలు రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అట్రాసిటీ, ఇతర కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment