vulgar behaviour
-
Elon Musk: బిల్‌గేట్స్‌పై ఎలన్ మస్క్ అసభ్య ట్వీట్
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అలాంటిది మస్క్ తాజాగా ఓ దిగజారుడు చర్యకు పాల్పడ్డాడు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను అవమానపరిచేలా శనివారం ఓ దారుణమైన ఫొటోను ట్విటర్లో షేర్ చేశాడు. ఐఫోన్లో ఆమధ్య ప్రెగ్నెంట్ మెన్(అఫీషియల్ ప్రకటన చేయకపోయినా అదే నిజం!) ఎమోజీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఒకవైపు బిల్‌గేట్స్, మరోవైపు ఆ ఎమోజీ ఫొటోను ఉంచి ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఒకవేళ మీరు త్వరగా బో**ను కోల్పోవాల్సి వస్తే.. అంటూ ఓ చిల్లర కామెంట్‌ను క్యాప్షన్‌గా ఉంచాడు. దానికి అసభ్యమైన అర్థం వస్తుంది. అందుకే మస్క్‌ను అతని ఫాలోవర్స్ తిట్టిపోస్తున్నారు. ఇందులో పలువురు ప్రముఖులు సైతం ఉండడం విశేషం. ఏ మత్తులో ఈ కామెంట్ చేశాడో, దాని వెనకాల కారణం ఏంటో తెలియదుగానీ.. ఈ ట్వీట్ ట్విటర్లో పెనుదుమారాన్నే రేపుతోంది ఇప్పుడు!. in case u need to lose a boner fast pic.twitter.com/fcHiaXKCJi — Elon Musk (@elonmusk) April 23, 2022 చదవండి👉🏼: నెట్‌ఫ్లిక్స్‌పై మస్క్ కామెంట్లు ఎందుకంటే.. -
నువ్వు ఎవడ్రా చెప్పడానికి.. బోండా ఉమ దౌర్జన్యం
-
నడిరోడ్డుపై కీచక పర్వం
నర్సీపట్నం: మద్యం మత్తులో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. తమ ద్విచక్రవాహనానికి సైడు ఇవ్వలేదన్న సాకుతో ఓ ఆటో డ్రైవర్‌ను కొట్టడమే కాకుండా అడ్డు వచ్చిన అతని భార్య పట్ల దురుసుగా ప్రవర్తించి, ఆమె చీర లాగేశారు. పట్టణ సీఐ స్వామినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. కోటవురట్ల మండలం యండపల్లికి చెందిన మూర్తి నానిబాబు(ఆటోడ్రైవర్),భార్య రాజేశ్వరి, సోదరుడు అప్పలరాజు కలసి బుధవారం నర్సీపట్నంఏరియా ఆస్పత్రికి బయలుదేరారు. పూటు గా మద్యం తాగిన బొడగ రామకృష్ణ , ఎలిశెట్టి నాగేశ్వరరావులు బైక్‌పై వస్తూ అబీద్‌సెంటర్ వద్ద ఆటోను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించారు. ట్రాఫిక్ సమస్య వల్ల ఆటో డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన ఆ యువకులు కొంతదూరం వచ్చిన తరువాత ఆటోను ఆపి డ్రైవర్ నానిబాబును ఆటోలోంచి కిందకు దించి తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో ఆటో డ్రైవర్ భార్య రాజేశ్వరి అడ్డుకోగా ఆమెను కూడా ఇబ్బంది పెట్టారు. చీరలాగేడంతో పాటు కులం పేరుతో దూషించారు. బాధితురాలు రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అట్రాసిటీ, ఇతర కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. -
కీచక ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోండి
రంగారెడ్డి (కీసర): విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని కేఆర్కే డిఎడ్ కళాశాల విద్యార్థులు సోమవారం కళాశాల ఆవరణలో ధర్నా నిర్వహించారు. కీసర మండలం అంకిరెడ్డిపల్లిలోని కేఆర్కే డీఎడ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినుల పట్ల ప్రిన్సిపాల్ సాంబిరెడ్డి కొన్ని నెలలుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ విద్యార్థినులను తన కార్యాలయానికి పిలిపించుకొని లైంగికంగా వేధిస్తున్నారని వారు వాపోయారు. సెల్ఫోన్లో అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ ఎవరికైనా చెబితే హాజరు శాతాన్ని తగ్గిస్తానని బెదిరిస్తున్నారని వారు తెలిపారు. ప్రిన్సిపాల్ వేధింపులపై కళాశాల డైరైక్టర్ రాధాకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందన లేదన్నారు. తప్పని సరి పరిస్థితుల్లోనే రోడ్డెక్కాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. కీచక ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని వారు నినదించారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని కీసర సి.ఐ గురువారెడ్డి తెలిపారు.