
'ఎమ్మెల్సీ సీటు ఇస్తానని చెప్పి మాట తప్పారు'
విశాఖ: విశాఖపట్నం స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటును తనకు కేటాయిస్తానని చెప్పిన టీడీపీ అధిష్టానం మాట తప్పిందని రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కన్నబాబు రాజు పేర్కొన్నారు. సోమవారం ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కన్నబాబు మాట్లాడారు.
నవ్యాంధ్రలో మంత్రి నారాయణ మొదటి ఎమ్మెల్సీ సీటు తనకే ఇస్తానని హామీ ఇచ్చారని.. ఇచ్చిన మాట తప్పడం వల్లే స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలే తన బలమన్నారు. దీంతో పాటు అన్ని పార్టీల మద్దతు తీసుకుంటున్నట్లు కన్నబాబు రాజు స్పష్టం చేశారు.