kannababu raju
-
దేవుడితో ఆటలా?.. ఎప్పుడూ ఒకే ప్రభుత్వం ఉండదు.. కన్నబాబు రాజు స్ట్రాంగ్ రియాక్షన్
-
అంబేద్కర్ ఘటనపై చంద్రబాబుకి కన్నబాబు రాజు స్ట్రాంగ్ కౌంటర్
-
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా కొనసాగే అర్హత విశాఖకు ఉంది
-
వైఎస్సార్సీపీలో చేరిన కన్నబాబు రాజు
-
వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
సాక్షి, కృష్ణా : విశాఖ జిల్లా యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఆయన కుమారుడు, విశాఖ డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మలు టీడీపీని వీడి శనివారం వైఎస్సార్సీపీలో చేరారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వారు కలిసి పార్టీలో చేరారు. వారికి వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట జిల్లా తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ డీఎస్ఎన్ రాజు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రాజు, మండలి ప్రధాన కార్యదర్శి శంకర్ రావులతో పాటు వెయ్యి మంది వైఎస్సార్సీపీలో చేరారు. కన్నబాబు విశాఖపట్నం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యేగా రెండు సార్లు పనిచేశారు. 2014 ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు. అందుకోసం తాను సైనికుడిలా పనిచేస్తానని చెప్పారు. -
వైఎస్సార్సీపీలోకి చేరనున్న టీడీపీ నేత
-
మే 5న వైఎస్సార్సీపీలో చేరుతున్నా: టీడీపీ నేత
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మే 5న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు టీడీపీ నేత, యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ప్రకటించారు. జగన్ నాయకత్వంలో ఓ సామాన్య కార్యకర్తగా పనిచేసేందుకు బేషరతుగా పార్టీలో చేరుతున్నట్టు ఆయన వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగరంలో సోమవారం నిర్వహించనున్న వంచన వ్యతిరేక దీక్ష ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆదివారం సాయంత్రం ఆయన సభాస్థలి వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని యత్నాలు చేసినా వైఎస్సార్సీపీలోకి వెళ్లడం ఖాయమని తేల్చిచెప్పారు. యు.వి.రమణ మూర్తిరాజు (కన్నబాబురాజు) 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అభ్యర్థిగా విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. -
'టీడీపీ అధిష్టానం మాట తప్పింది'
-
'ఎమ్మెల్సీ సీటు ఇస్తానని చెప్పి మాట తప్పారు'
విశాఖ: విశాఖపట్నం స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటును తనకు కేటాయిస్తానని చెప్పిన టీడీపీ అధిష్టానం మాట తప్పిందని రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కన్నబాబు రాజు పేర్కొన్నారు. సోమవారం ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కన్నబాబు మాట్లాడారు. నవ్యాంధ్రలో మంత్రి నారాయణ మొదటి ఎమ్మెల్సీ సీటు తనకే ఇస్తానని హామీ ఇచ్చారని.. ఇచ్చిన మాట తప్పడం వల్లే స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలే తన బలమన్నారు. దీంతో పాటు అన్ని పార్టీల మద్దతు తీసుకుంటున్నట్లు కన్నబాబు రాజు స్పష్టం చేశారు. -
రెబల్‌గా బరిలోకి కన్నబాబు రాజు
విశాఖ : ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో విశాఖ జిల్లాలో అసమ్మతి సెగ రగులుతోంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ నేత కన్నబాబు రాజు సోమవారం మధ్యాహ్నం ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీడీపీ టికెట్ నిరాకరించడంతో ఆయన రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరిగిందని కన్నబాబు రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తామని చెప్పిన టీడీపీ అధ్యక్షుడు మాట తప్పారని, రాబోయే రోజుల్లో టీడీపీ భారీ మూల్యం చెల్లించుకుంటుందని ఆయన హెచ్చరించారు.