టైరు పేలి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
Published Sat, Feb 25 2017 12:20 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
యలమంచిలి(విశాఖపట్నం): విశాఖపట్నం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న వోల్వో బస్సు ముందు టైరు పేలడంతో.. పొలాల్లోకి దూసుకెళ్లింది.
యలమంచిలి మండలం మర్రిబండ శివారులో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బస్సు ముందు టైరు పేలడంతో కుదుపునకు లోనై.. పొలాల్లోకి దూసుకెళ్లింది. గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement