విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పది మంది గాయాలపాలయ్యారు.
విశాఖపట్నం: విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పది మంది గాయాలపాలయ్యారు.
మోసయ్యపేటకు చెందిన వీరు పెళ్లి సంబంధం మాట్లాడుకునేందుకు సోమవారం ఉదయం ఆటోలో పరవాడకు బయలుదేరారు. ఆటో మడ్తూరు ఆయిల్ బంక్ సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆటోలో ఉన్న బాలుడు సహా పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అచ్యుతాపురం పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.