
తల్లిదండ్రులతో పొన్నాడ జ్యోతిర్మయి(కుడివైపు యువతి)
సాక్షి, విశాఖపట్నం : గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల పోటీపరీక్షల ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. విశాఖపట్నానికి చెందిన సవ్వాన గోపికృష్ణ 118.75 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచారు. స్టీల్‌ప్లాంట్ ప్రాంతానికి చెందిన పొన్నాడ జ్యోతిర్మయి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులో స్టేట్ ర్యాంకు సాధించింది. స్థానిక జోన్లవారీ ర్యాంకులను ప్రకటించారు. కటాఫ్ మార్కులపై స్పష్టత రావాల్సి ఉంది. శుక్రవారం జిల్లా కలెక్టరు కార్యాలయాలకు పూర్తిస్థాయిలో మెరిట్ జాబితా వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 10,872 ఉద్యోగాల కోసం 2,35,614 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ కొలువుల కోసం ఈనెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ నిర్వహించిన పోటీపరీక్షలకు 2,10,443 మంది హాజరయ్యారు. ఈ అభ్యర్థుల్లో పొరుగు జిల్లాలవారే కాకాండా ఎంటెక్ వంటి ఉన్నత చదువులు అభ్యసించిన వారు సైతం ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment