
సాక్షి, విశాఖపట్నం: కరోనా వైరస్ సాకుతో మాస్క్‌లను అధిక ధరలకు విక్రయించడంతో విశాఖ జిల్లాలో మెడికల్ షాప్‌లపై సోమవారం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ కే.రజిత ఆధ్వర్యంలో 65 మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. మాస్క్‌లను అధిక ధరలకు వ్యాపారులు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు మేరకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు చేపట్టారు. మూడు మందుల షాపుల్లో అధిక ధరలకు మాస్క్‌లు విక్రయినట్లు గుర్తించిన అధికారులు.. షాప్‌ల లైసెన్స్‌లను సస్పెండ్ చేశారు.