రాష్ట్ర ప్రభుత్వం బడుగులకు బాసటగా నిలిచింది. వారి బతుకుల్లో వెలుగులు నింపడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంది. సంక్షేమ ఫలాలు అందరికీ చేరేలా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ను విభజించింది.ఎస్సీలో మెజారిటీ సామాజిక వర్గాలైన మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల ఏర్పాటు చేయనుంది. దీనిపై ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, విశాఖపట్నం: ఎస్సీ కార్పొరేషన్ ఇకపై మూడు కార్పొరేషన్లు కానుంది. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ప్రజాసంకల్పయాత్రలో వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ ప్రభుత్వం అధి కారంలోకి వస్తే మాల, మాదిగలతో పాటు రెల్లి కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం ఎస్సీ కార్పొరేషన్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలో లక్షలాది మందికి ప్రయోజనం..
జిల్లాలో షెడ్యూల్డ్ కులాల్లో 46 ఉపకులాలు న్నాయి. అందులో మాదిగ, మాల, రెల్లి, పైడి, ఆది ఆంధ్ర వారు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు) సుమారుగా 3,29,486 మంది వరకు ఉన్నారు. ఇందులో 1,62,873 పురుషులు, 1,66,613 మహిళలు న్నారు. వీరందరికీ ప్రయోజనం చేకూరనుంది.
నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు..
25 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎమ్మార్పీస్ పోరాటం చేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నిబంధనలకు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేశారటూ ఎస్సీ మాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం రాష్ట్రంలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ చేసి అమలు చేశారు. అయితే ఆ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో మళ్లీ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పథకాలు అన్ని వర్గాలకు అమలు చేస్తున్నారు. అయినా ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందేనని ఎమ్మార్పీఎస్‌లో ఓ వర్గం నేటికీ పోరాటం చేస్తూనే ఉంది. దీంతో ఎస్సీల్లో ఉన్న మాల, మాదిగల మధ్య అంతరం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో మాల, మాదిగల మధ్య సఖ్యత పెంపొందించేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ కార్పొరేషన్‌ను మూడుగా విభజిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్ల ద్వారా ఎస్సీలకు సంక్షేమ ఫలాలను అందించేందుకు చర్యలు చేపడుతోంది.
కార్పొరేషన్ విభజనపై హర్షం..
ఎస్సీల ఆర్థికాభివృద్ధికోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1974లో ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేషన్‌ను ఆయా ఉపకులాలను విభజించాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు విస్మరించాయి. ప్రజా సంకల్పయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డికి ఎస్సీ కార్పొరేషన్ విభజించాలని తామంతా విన్నవించాం. ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చారు. రాష్ట్రంలో 59 ఉపకులాలకు నేరుగా ఆర్థిక ఫలాలు అందే విధంగా ఎస్సీ కార్పొరేషన్‌ను విభజించడం గొప్పవిషయం. మాట తప్పకుండా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ కార్పొరేషన్ మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న దళితులమంతా ఆనందం వ్యక్తం చేస్తున్నాం.
– బోని శివరామకృష్ణ. దళితనేత
సీఎం జగనన్నకు రుణపడి ఉంటాం
గతంలో ఎన్నో ప్రభుత్వాలు మాటివ్వడమే గాని హామీ నెరవేర్చిన పాపాన పోలేదు. కేవలం రాజకీయ లబ్ధికోసం మమ్మల్ని వాడుకున్నారే తప్పా ఎవరూ న్యాయం చేయలేదు. ప్రజాసంకల్పయాత్రలో విన్నవించుకున్నాం. జగనన్న ఇచ్చిన హామీ మేరకు మూడు కార్పొరేషన్లు గా విభజించి సాధ్యం కాదన్నది సుసాధ్యం చేశారు. దళితుల సంక్షేమం కోసం పాటుపడే ఏపీ సీఎం జగనన్నకి తామంతా రుణపడి ఉంటాం.
– వీజే అజయ్‌కుమార్, దళితనేత
విభజనతో సంక్షేమఫలాలు
కార్పొరేషన్ విభజనతో సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతా యి. జిల్లాలో దళితులం ఎక్కువగా ఉన్నా మాకు ఏ ప్రభుత్వం న్యా యం చేయలేదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే న్యాయం జరిగింది. మళ్లీ ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే మా అభివృద్ధి జరుగుతుంది. కార్పొరేషన్ విభజనతో ఎక్కువ మందికి ప్రభుత్వ పథకాలు అందుతాయి.
– పాకా సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment