విశాఖ జిల్లాలో శనివారం విషాదం నెలకొంది. పాడేరు పట్టణం చాకలిపేటకు చెందిన ఓ మహిళ కుటుంబకలహాల నేపథ్యంలో తన ఇద్దరు పిల్లలతో కలసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
పాడేరు (విశాఖపట్నం) : భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలతో మనస్తాపం చెందిన నందిని (26) అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి పాడేరులోని చాకలిపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం రాత్రి నందినికి, భర్తకు మధ్య గొడవ జరిగింది. కలత చెందిన నందిని.. తన ఇద్దరు పిల్లలను తీసుకుని సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం సాయంత్రం స్థానికులు బావిలో శవాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.