చివ్వెంల (సూర్యాపేట) : దివ్యాంగురాలు అదృశ్యమైంది. ఈ ఘటన మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేటలోని సీతారాంపురం కాలనీకి చెందిన నగరి పార్వతమ్మ తన కూతురు నగరి రేణుకను తీసుకుని చివ్వెంల మండలం వల్లభాపురం ఆవాసం ఉండ్రుగొండ గ్రామానికి తన చెల్లెలు పండగ సైదమ్మ ఇంటికి ఈనెల 12వ తేదీన వచ్చింది. కాగా శుభకార్యం అనంతరం శుక్రవారం పార్వతమ్మ సూర్యాపేటకు వెళ్లగా రేణుక చిన్నమ్మ ఇంటి వద్దే ఉంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అదే గ్రామానికి చెందిన వరుసకు బాబాయ్ అయిన పండగ ఉప్పలయ్య రేణుకను తన ఇంటికి తీసుకెళ్లి అక్కడ నుంచి అడవిలో ఉన్న గొర్రెల వద్ద కాపాలగా ఉండాలని రేణుకను సైకిల్‌పై తీసుకువెళ్లాడు. సాయంత్రం వరకు రేణుక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో వెతుకుతుండగా రేణుకను ఉప్పలయ్య సైకిల్‌పై వ్యవసాయ బా వి వద్దకు తీసుకువెళ్లాడని గమనించిన కొంత మహిళలు చెప్పా రు.
దీంతో అడవిలోకి వెళ్లి పరిశీలించగా గ్రామ శివారులోని ఓ గడ్డివాము వద్ద రేణుక వస్త్రం ఒకటి లభించగా, కొంత దూరంలో పత్తిచేనులో పండగ ఉప్పలయ్య సైకిల్ పడి ఉండటంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ బి.ప్రవీణ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో జాగిలాలను రప్పించారు. సాయంత్ర వరకు అడవిలో వెతికినా ఫలితం లేకపోవడంతో తిరుగు ము ఖం పట్టారు. వందల ఎకరాల విస్తీర్ణంలో అడవి వ్యాపించి ఉండటంతో ఆచూకీ లభ్యం ఇబ్బందికరంగా మారింది. బాధితురాలి తల్లి పార్వతమ్మ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ బి.ప్రవీణ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హత్య చేసి ఉండవచ్చా..?
దివ్యాంగురాలిని వెంట తీసుకువెళ్లిన ఉప్పలయ్య ఎదైన అఘాయిత్యానికి పాల్పడి ఆమెను హత్య చేసి ఉంవవచ్చా అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా కని పించక పోవడంతో ఉప్పలయ్య ఎదైనా చేసి పారి పోయి ఉండవచ్చునని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment