బంజారాహిల్స్: తమ తల్లి కనిపించడం లేదని, వెదికి పెట్టాలని కన్నీరుమున్నీరవుతూ ఇద్దరు చిన్నారులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే.. యూసుఫ్‌గూడ సమీపంలోని జవహర్‌నగర్‌లో నివసించే శ్రావణి(37) రెండు వారాల క్రితం అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. భర్త సురేష్ కారు డ్రైవర్ కాగా, శ్రావణి ఓ ప్రైవేట్ సంస్థలో క్లర్క్‌గా పని చేస్తోంది.
తమ తల్లి కనిపించడం లేదని పదో తరగతి చదువుతున్న హర్ష(15), తొమ్మిదో తరగతి చదువుతున్న శరణ్య(13) జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పదిహేను రోజులైన తల్లి జాడ తెలియకపోవడం, తండ్రి పట్టించుకోకపోవడంతో పిల్లలిద్దరూ బుధవారం జూబ్లీహిల్స్ ఠాణాకు వచ్చారు. తల్లి లేకుండా ఉండలేకపోతున్నామని ఆ ఇద్దరు చిన్నారులు రోదిస్తుండటం చూసి అక్కడున్న వారంతా చలించిపోయారు.
అమ్మా.. నువ్వుక్కెడున్నా వెంటనే ఇంటికి రావాలని వారు కోరారు. తరచూ తల్లిదండ్రుల మధ్య గొడవలు జరిగేవి చిన్నారులు ఈ సందర్భంగా పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు శ్రావణి కోసం గాలింపు చేపట్టారు. అయితే, ఆమె సెల్‌ఫోన్‌ను వెంట తీసుకెళ్లకపోవడంతో జాడ తెలియడం లేదు. భర్త సురేష్‌ను పోలీసులు విచారిస్తున్నారు. గతంలోనూ ఆమె రెండు సార్లు ఇలానే అదృశ్యమైనట్టు పోలీసులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment