అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం 'పుష్ప2'.. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ ఈవెంట్స్ నిర్వహించిన పుష్ప ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నేడు (డిసెంబర్2) హైదరబాద్‌లో జరపనున్నారు.
యూసుఫ్‌గూడ పోలీస్‌లైన్స్‌లో సోమవారం జరగనున్న పుష్ప–2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏర్పాట్లను నగర అదనపు సీపీ విక్రమ్‌సింగ్ మాన్, వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్, వెస్ట్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ కట్టా పరిశీలించారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి యూసుఫ్‌గూడ బెటాలియన్‌లో ఈ కార్యక్రమం జరగనుండగా కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నట్లు ప్రజలు ఇతర రహదారుల నుంచి వెళ్లాలని కోరారు.
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు నుంచి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం వైపు వెళ్లే వాహనదారులు శ్రీకృష్ణానగర్, శ్రీనగర్‌కాలనీ మీదుగా పంజగుట్ట వైపు వెళ్లాల్సి ఉంటుంది.
మైత్రివనం జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, మాదాపూర్ వైపు వెళ్లే వాహనదారులు యూసుఫ్‌గూడ బస్తీ వద్ద ఆర్‌బీఐ క్వార్టర్స్ వైపు మళ్లి కృష్ణానగర్ జంక్షన్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళ్లాలి.
బోరబండ బస్టాపు వైపు నుంచి మైత్రివనం జంక్షన్‌కు వెళ్లే వాహనదారులు ప్రైమ్ గార్డెన్, కల్యాణ్‌నగర్, మిడ్‌ల్యాండ్ బేకరీ, జీటీఎస్ కాలనీ, కల్యాణ్ నగర్ జంక్షన్, ఉమేష్ చంద్ర విగ్రహం మీదుగా యూ టర్న్ తీసుకుని, ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద యూ టర్న్ తీసుకుని మైత్రివనం వైపు వెళ్లాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
పార్కింగ్ ఇలా..
కార్లను సవేరా అండ్ మహమూద్ ఫంక్షన్ హాళ్లలో పార్కు చేయాలి. జానకమ్మ తోటలో కార్లు, బైకులు పార్క్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment