yousafguda
-
నేడు పుష్ప–2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. వెళ్లే వారికి పోలీసుల సూచనలు
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం 'పుష్ప2'.. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ ఈవెంట్స్ నిర్వహించిన పుష్ప ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నేడు (డిసెంబర్2) హైదరబాద్‌లో జరపనున్నారు. యూసుఫ్‌గూడ పోలీస్‌లైన్స్‌లో సోమవారం జరగనున్న పుష్ప–2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏర్పాట్లను నగర అదనపు సీపీ విక్రమ్‌సింగ్ మాన్, వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్, వెస్ట్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ కట్టా పరిశీలించారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి యూసుఫ్‌గూడ బెటాలియన్‌లో ఈ కార్యక్రమం జరగనుండగా కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నట్లు ప్రజలు ఇతర రహదారుల నుంచి వెళ్లాలని కోరారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు నుంచి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం వైపు వెళ్లే వాహనదారులు శ్రీకృష్ణానగర్, శ్రీనగర్‌కాలనీ మీదుగా పంజగుట్ట వైపు వెళ్లాల్సి ఉంటుంది. మైత్రివనం జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, మాదాపూర్ వైపు వెళ్లే వాహనదారులు యూసుఫ్‌గూడ బస్తీ వద్ద ఆర్బీఐ క్వార్టర్స్ వైపు మళ్లి కృష్ణానగర్ జంక్షన్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళ్లాలి. బోరబండ బస్టాపు వైపు నుంచి మైత్రివనం జంక్షన్‌కు వెళ్లే వాహనదారులు ప్రైమ్ గార్డెన్, కల్యాణ్‌నగర్, మిడ్‌ల్యాండ్ బేకరీ, జీటీఎస్ కాలనీ, కల్యాణ్ నగర్ జంక్షన్, ఉమేష్ చంద్ర విగ్రహం మీదుగా యూ టర్న్ తీసుకుని, ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద యూ టర్న్ తీసుకుని మైత్రివనం వైపు వెళ్లాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పార్కింగ్ ఇలా.. కార్లను సవేరా అండ్ మహమూద్ ఫంక్షన్ హాళ్లలో పార్కు చేయాలి. జానకమ్మ తోటలో కార్లు, బైకులు పార్క్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. -
హైదరాబాద్‌లో ‘పుష్ప 2’ ఈవెంట్.. చివరి నిమిషంలో ప్లాన్ ఛేంజ్!
హైదరాబాద్‌లో పుష్ప 2 ఈవెంట్ పక్కా.. కానీ ఎక్కడ? ఎప్పుడు? అనేది నిన్నటి వరకు క్లారిటీ రాలేదు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్లో సోమవారం(డిసెంబర్ 2) ఈ ఈవెంట్ జరగనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్.చివరి నిమిషంలో ప్లాన్ ఛేంజ్ఇప్పటికే పాట్నా, ముంబై, చెన్నై, కొచ్చిలో భారీ ఈవెంట్స్ నిర్వహించిన పుష్ప 2 టీమ్.. అంతకు మించిన ఈవెంట్‌ని హైదరాబాద్‌లో జరపాలని ముందు నుంచే ప్లాన్ వేసుకున్నారు. డిసెంబర్ 1న ఈ ఈవెంట్‌ని నిర్వహించాలనుకున్నారు. తొలుత ఎల్బీ స్టేడియంలో ప్లాన్ చేశారు. కానీ అక్కడ పర్మిషన్ లభించలేదు. దీంతో మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్‌కి మార్చారు. అయితే అక్కడ కూడా అనుమతి లభించకపోవడంతో చివరి నిమిషంలో ఈ ఈవెంట్‌ని యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్‌కి మార్చారు. ఈ రోజు కాకుండా రేపు (డిసెంబర్ 2) ఈ భారీ ఈవెంట్‌ని నిర్వహించనున్నారు. బన్నీతో పాటు చిత్రబృందం అంతా ఈ కార్యక్రమానికి హాజరుకానుంది. ‘అలా.. ’తర్వాత మళ్లీ ఇలా..యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్లో బన్నీ సినిమా ఈవెంట్ జరగడం ఇది రెండోసారి. తొలిసారి 2020లో బన్నీ నటించిన ‘అల..వైకుంఠపురములో’ మూవీ మ్యూజికల్ ఈవెంట్ ఇక్కడే జరిగింది. దాదాపు ఆరు వేల మంది అంచనాతో ఈవెంట్ నిర్వహించగా.. 15 వేల మందికి పైగా హాజరయ్యారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అంతేకాదు ఆరు వేల మందికి పర్మిషన్ తీసుకొని..15 వేల మందిని ఆహ్వానించారంటూ ఈవెంట్ ఆర్గనైజేషన్ శ్రేయాస్ మీడియా పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.టికెట్ రేట్లు భారీగా పెంపుసుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రంపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయింది. బన్నీ మాస్ ఫెర్ఫార్మెన్స్ని చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారి కోసమే బెనిఫిట్ షోలు కూడా వేయబోతున్నారు. తెలంగాణలో నవంబర్ 4 రాత్రి 9.30 గంటల నుంచే ఈ బెన్ఫిట్ షోలు పడబోతున్నాయి. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. అంతేకాదు టికెట్ ధరలు కూడా పెంచేశారు. బెనిఫిట్ షోల టికెట్ ధరలు రూ.800 ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లో బెనిఫిట్ షో లకు ఈ ధరలు వర్తిస్తాయి. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200లకు టికెట్ ధరను పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంపునకు అనుమతి తీసుకున్నారు. -
అమ్మా.. ఎక్కడున్నా వెంటనే రా..!
బంజారాహిల్స్: తమ తల్లి కనిపించడం లేదని, వెదికి పెట్టాలని కన్నీరుమున్నీరవుతూ ఇద్దరు చిన్నారులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే.. యూసుఫ్‌గూడ సమీపంలోని జవహర్‌నగర్‌లో నివసించే శ్రావణి(37) రెండు వారాల క్రితం అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. భర్త సురేష్ కారు డ్రైవర్ కాగా, శ్రావణి ఓ ప్రైవేట్ సంస్థలో క్లర్క్‌గా పని చేస్తోంది. తమ తల్లి కనిపించడం లేదని పదో తరగతి చదువుతున్న హర్ష(15), తొమ్మిదో తరగతి చదువుతున్న శరణ్య(13) జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పదిహేను రోజులైన తల్లి జాడ తెలియకపోవడం, తండ్రి పట్టించుకోకపోవడంతో పిల్లలిద్దరూ బుధవారం జూబ్లీహిల్స్ ఠాణాకు వచ్చారు. తల్లి లేకుండా ఉండలేకపోతున్నామని ఆ ఇద్దరు చిన్నారులు రోదిస్తుండటం చూసి అక్కడున్న వారంతా చలించిపోయారు. అమ్మా.. నువ్వుక్కెడున్నా వెంటనే ఇంటికి రావాలని వారు కోరారు. తరచూ తల్లిదండ్రుల మధ్య గొడవలు జరిగేవి చిన్నారులు ఈ సందర్భంగా పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు శ్రావణి కోసం గాలింపు చేపట్టారు. అయితే, ఆమె సెల్‌ఫోన్‌ను వెంట తీసుకెళ్లకపోవడంతో జాడ తెలియడం లేదు. భర్త సురేష్‌ను పోలీసులు విచారిస్తున్నారు. గతంలోనూ ఆమె రెండు సార్లు ఇలానే అదృశ్యమైనట్టు పోలీసులు చెప్తున్నారు. -
నటి శ్రీలక్ష్మి కేసులో సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన
హైదరాబాద్ : సినీనటి శ్రీలక్ష్మి నగలను స్నాచింగ్ చేసిన నిందితులను పట్టుకునేందుకు ఎస్ఆర్ నగర్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం శ్రీలక్ష్మి యూసఫ్‌గూడలోని అయ్యంగార్ బేకరీకి వచ్చి వెళ్తుండగా దుండగలు ఆమె మెడలోని 8 తులాల బంగారు నగలను తెంచుకెళ్లిన విషయం తెలిసిందే. కారు వద్దకు ఆమె ఒంటరిగా వస్తున్నట్లు గమనించి దుండగులు స్నాచింగ్‌కు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే శ్రీలక్ష్మిని ఎక్కడి నుంచి వెంబడించారన్న దానిపై విచారణ జరుపుతున్నారు. శ్రీనగర్ కాలనీలోని శ్రీలక్ష్మి నివాసం నుంచి యూసుఫ్‌గూడలోని బేకరీ వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. గురువారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన శ్రీలక్ష్మికి ...ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని అందచేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శంకర్ తెలిపారు.