విమానాశ్రయంలో మహిళ అదృశ్యం | women missing in shamshabad air port | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో మహిళ అదృశ్యం

Published Tue, May 10 2016 8:56 PM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

women missing in shamshabad air port

శంషాబాద్: రియాద్ నుంచి వచ్చిన ఓ మహిళ శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన తర్వాత కనిపించకుండాపోయింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరికి చెందిన షేక్ రహీమున్నీసా(45) ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం రియాద్ వెళ్లింది. ఎయిర్ ఇండియా 9122 విమానంలో ఈ నెల 8వ తేదీన రియాద్ నుంచి ఆమె బయలుదేరింది. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రహీమున్నీసా అక్కడి నుంచి ఇంటికి చేరుకోలేదు. బంధువుల ఆమె కోసం గాలించినా ఫలితం లేకుండా పోవడంతో మంగళవారం ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement