విమానాశ్రయంలో మహిళ అదృశ్యం
శంషాబాద్: రియాద్ నుంచి వచ్చిన ఓ మహిళ శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన తర్వాత కనిపించకుండాపోయింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరికి చెందిన షేక్ రహీమున్నీసా(45) ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం రియాద్ వెళ్లింది. ఎయిర్ ఇండియా 9122 విమానంలో ఈ నెల 8వ తేదీన రియాద్ నుంచి ఆమె బయలుదేరింది. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రహీమున్నీసా అక్కడి నుంచి ఇంటికి చేరుకోలేదు. బంధువుల ఆమె కోసం గాలించినా ఫలితం లేకుండా పోవడంతో మంగళవారం ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.