విజయనగరం జిల్లాలో మహిళ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. అదృశ్యమైన మహిళను ఆమె భర్తే హతమార్చినట్టు తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని వెంకంపేట ఏజెన్సీ ప్రాంతానికి చెందిన చిటికల రమణమ్మ గత ఏడాది అక్టోబర్ 15న అదృశ్యమైంది. దీంతో ఆమె కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.