
కాచిగూడ: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లో ప్రతి ఏడాది నిర్వహించే వినూత్నమైన ‘బ్రైడ్స్ ఆఫ్ ఇండియా’ 7వ ఎడిషన్ ఆదివారం హిమాయత్‌నగర్ బ్రాంచిలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాంచి స్టోర్ హెడ్ ఫయాజ్ మాట్లాడుతూ.. పెళ్లిళ్ల సీజన్‌కు కొత్త హంగులు అద్దడంతో పాటు కుటుంబాల్లో జరిగే వేడుకలకు సరికొత్త మెరుపులతో వెలుగు జిలుగులు సమకూర్చుతుందన్నారు. బ్రైడ్స్ ఆఫ్ ఇండియా కోసం ఎంపిక చేసిన ఇతివృత్తం ఆచారాలు, నవ వధువుల కోసం తీర్చిదిద్దిన వివాహ ఆభరణాలు, సంప్రదాయ కళా కౌశలాన్ని ప్రతిబింబిస్తూ మహిళలను అలరించే ఆభరణాల కళాకృతులను ‘బ్రైడ్స్ ఆఫ్ ఇండియా– 2019 క్యాంపైన్‌లో విస్తృత శ్రేణిలో ఆవిష్కరించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment