బాడీ బిల్డింగ్ చాంప్ అహ్మద్ బామాస్ | body building champion Ahmed bamas | Sakshi
Sakshi News home page

బాడీ బిల్డింగ్ చాంప్ అహ్మద్ బామాస్

Published Tue, Feb 11 2014 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM

body building champion Ahmed bamas

కాచిగూడ, న్యూస్‌లైన్: షేక్ హుస్సేన్ మెమోరియల్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో అహ్మద్ బామాస్ విజేతగా నిలిచాడు. తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాచిగూడలోని నెహ్రూనగర్ మైదానంలో ఈ పోటీలు నిర్వహించారు. ఇందులో జంట నగరాల నుంచి దాదాపు 150 జిమ్‌లకు చెందిన సుమారు 200 మంది బాడీబిల్డర్లు పాల్గొన్నారు. తొలి స్థానంలో నిలిచిన అహ్మద్‌కు ట్రోఫీతో పాటు నగదు బహుమతి కూడా అందజేశారు. రాజు రన్నరప్‌గా నిలువగా, శివకు మూడో స్థానం దక్కింది.
 
 బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎండీ సలీమ్, ఎండీ ఖాజా, ఎండీ ఖాదర్, మాజీ మంత్రి కృష్ణయాదవ్, పీసీసీ కార్యదర్శి ఆర్.లక్ష్మణ్ యాదవ్, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ ముస్తాఫా అలీ, భావి ధన్‌రాజ్, బాడీ బిల్డర్స్ సంతోష్, మోతేశామ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement