
కాచిగూడ: సెల్‌ఫోన్ ఎక్కువగా మాట్లాడవద్దన్నందుకు ఓ బాలిక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన సంఘటన కాచిగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. కాచిగూడ ఎస్‌ఐ నరేష్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌కు చెందిన బాలాజీ రావు కుటుంబంతో కలిసి శుభకార్యం నిమిత్తం ఈ నెల 8న కాచిగూడ, సుందర్‌నగర్ లోని బంధువుల ఇంటికి వచ్చారు.
బాలాజీరావు కుమార్తె సీహెచ్ గౌరీ (13) 8వ తరగతి చదువుతోంది. సెల్ ఫోన్ అతిగా మాట్లాడుతుండడంతో తల్లి, సోదరుడు ఆమెను మందలించారు. దీంతో మనస్తాపానికి లోనైన మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయింది. సెల్‌ఫోన్ కూడా వెంట తీసుకెళ్లింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉంది. గౌరి సోదరుడు విష్ణు కార్తి ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment