![Girl Missing In Kavadiguda Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/28/GIrl.jpg.webp?itok=NBYktXjF)
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కవాడిగూడలో 13 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. బాలిక మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బాలిక మిస్సింగ్‌పై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నిన్న (మంగళవారం) ఉదయం బయటకెళ్లిన బాలిక అదృశ్యం ఘటన కలకలం రేపుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలిక ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కవాడిగూడలో బాలిక ఆటో ఎక్కినట్టు గుర్తించారు. ఆటోను ట్రేస్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇప్పటికే స్నేహపురి కాలనీలో బాలిక ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేశారు. సిగ్నల్స్ ఆధారంగా రెండు బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు.
చదవండి: మెదక్ జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం.. కారులో కిడ్నాప్ చేసి..
Comments
Please login to add a commentAdd a comment