kavadiguda
-
కవాడిగూడలో మిస్సైన తేజశ్రీ కోసం గాలింపు ముమ్మరం
-
కవాడిగూడలో బాలిక అదృశ్యం.. బాలిక మానసిక పరిస్థితి సరిగా లేదంటున్న తల్లిదండ్రులు
-
హైదరాబాద్‌లో 13 ఏళ్ల బాలిక అదృశ్యం.. సీసీటీవీ ఫుటేజ్‌లో..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కవాడిగూడలో 13 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. బాలిక మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బాలిక మిస్సింగ్‌పై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిన్న (మంగళవారం) ఉదయం బయటకెళ్లిన బాలిక అదృశ్యం ఘటన కలకలం రేపుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలిక ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కవాడిగూడలో బాలిక ఆటో ఎక్కినట్టు గుర్తించారు. ఆటోను ట్రేస్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇప్పటికే స్నేహపురి కాలనీలో బాలిక ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేశారు. సిగ్నల్స్ ఆధారంగా రెండు బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు. చదవండి: మెదక్ జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం.. కారులో కిడ్నాప్ చేసి.. -
హైదరాబాద్: కవాడిగూడలో 13 ఏళ్ల బాలిక అదృశ్యం
-
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన మర్రి చెన్నారెడ్డి
కవాడిగూడ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన వ్యక్తి మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అని పలువురు వక్తలు కొనియాడారు. ప్రస్తుతం కొంతమంది తామే ఉద్యమాలు చేశామని గొప్పలు చెప్పుకుంటూ వారికి వారే తెలంగాణ జాతిపితగా చెలామణి అవుతున్నారని అన్నారు. కానీ తెలంగాణ సమాజానికి మర్రి చెన్నారెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఇందిరాపార్కులోని రాక్‌గార్డెన్‌లో ఆయన సమాధికి విగ్రహానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె అరుణ, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ మంత్రి కృష్ణయాదవ్, మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్‌రెడ్డి, మర్రిచెన్నారెడ్డి మనుమలు ఆదిత్యరెడ్డి, పురూరవరెడ్డి, కృష్ణారెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు పెద్దఎత్తున హాజరై నివాళులర్పించారు. -
బాలుడిని ఎత్తుకెళ్లిన గంట వ్యవధిలోనే కేసును చేధించిన పోలీసులు
-
ఐనాక్స్‌ను ప్రారంభించిన ప్రముఖ నటుడు అడవి శేషు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ అగ్రగామి మల్టీప్లెక్స్ ఛెయిన్ ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ నగరంలో తమ నాలుగో మల్టీప్లెక్స్ సినిమా థియేటర్స్‌ను ఏర్పాటు చేసింది. కవాడిగూడ మెయిన్ రోడ్‌లోని సత్వా నెక్లెస్ మాల్లో ఏర్పాటైన మల్టీప్లెక్స్‌ను ప్రముఖ నటుడు అడవి శేషు, దర్శకుడు శశికిరణ్ శనివారం ప్రారంభించారు. ఈ మల్టీ ప్లెక్స్‌లో మొత్తం 7స్క్రీన్స్ 1534 సీట్స్ ఉంటాయని ఐనాక్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అట్మాస్ సరౌండ్ సౌండ్, అడ్వాన్స్డ్ డిజిటల్ ప్రొజెక్షన్, 3డీ వ్యూ వంటి కిడ్స్ ప్లే ఏరియా తదితర ప్రత్యేకతలను ప్రేక్షకులు ఆస్వాదిస్తారన్నారు. ఈ మల్టీప్లెక్స్‌తో కలిపి నగరంలో తాము 26 స్క్రీన్స్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. చదవండి: (వాకింగ్‌కు వెళ్లిన.. సినీ నిర్మాత దుర్మరణం) -
ఘన సంస్కృతిని ముందుతరాలకు అందిద్దాం
కవాడిగూడ: ఘనమైన సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం చిరునామాగా ఉందని, ఈ సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిద్దామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో పది రోజులపాటు నిర్వహిస్తున్న హునార్ హాత్ ప్రదర్శనను ఆదివారం కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీతో కలిసి జి.కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, మన ప్రాచీన వారసత్వాన్ని హునార్ హాత్‌లో చూసుకోవచ్చని తెలిపారు. కరోనాతో చిన్న కళాకారులు బాగా నష్టపోయారని, వారికి ఆర్థిక సహాయం అందజేసేందుకు హునార్ హాత్ ఎంతో దోహదపడుతుందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశంలోని 75 ప్రధాన నగరాల్లో హునార్ హాత్‌ను ఏర్పాటు చేశారని, ఈ ప్రదర్శనను హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలిపారు. ప్రజలు దేశీయ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా కళాకారులను ఆదుకోవాలని సూచించారు. ఆయారంగాల్లో గుర్తింపుపొందిన దేశవ్యాప్త కళాకారుల చేత ప్రదర్శనలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఏప్రిల్ 1, 2, 3 తేదీలలో ఎన్టీఆర్ స్టేడియంలో అఖిలభారత సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి నఖ్వీ మాట్లాడుతూ, స్వాతంత్య్రానంతరం తొలిసారిగా ప్రధాని మోదీ నేతృత్యంలో చేతి వృత్తులు, కళాకారుల స్వదేశీ వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు మిషన్ మోడ్‌పై కృషిచేయడం ప్రారంభించిందన్నారు. తమ ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా హస్తకళాకారుల ఆదాయం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌అలీ, రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, స్థానిక కార్పొరేటర్ రచనశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: జాజుల
కవాడిగూడ: రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్, అదే రాజ్యాంగాన్ని మార్చాలనుకోవడం అవివేకమ న్నారు. రాజ్యాం గాన్ని మార్చాలని సీఎం చేసిన వ్యాఖ్య లను నిరసిస్తూ గురువారం ఇందిరా పార్కు ధర్నాచౌక్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాజుల మాట్లాడారు. బీఆర్ అంబేడ్కర్‌ను కేసీఆర్ అవమాన పరిచారని, దీనికి నిరసనగా రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేప ట్టాలని ఆయన పిలుపునిచ్చారు. -
వైరల్: మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండి!
-
రోల్‌మోడల్‌గా ఎదగాలి
కవాడిగూడ: స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ కమిటీ దేశంలోనే రోల్‌మోడల్‌గా ఎదగాలని రాష్ట్ర గవర్నర్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర ప్యాట్రన్ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. దీనికిగానూ గైడ్స్‌కు తనవంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. గురువారం దోమలగూడ గగన్ మహల్‌లోని ‘భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్’తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫౌండేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన గవర్నర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, గురువులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. తాను కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థినేనని గుర్తుచేశా రు. సమాజానికి ఏ విధంగా సహాయం చేయాలి, ఇతరుల పట్ల ఎలా ఉండాలో ఇక్కడే నేర్చుకున్నానని తెలిపారు. తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు గైడ్స్ శిక్షణ తీసుకున్నానని చెప్పారు. అనంతరం తెలంగాణ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర గవర్నర్ స్కౌట్స్ డ్రెస్‌లో రావడం సంతోషంగా ఉందన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయని, ప్రస్తుతం ఇక్కడ 590 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. గత రెండేళ్లుగా చేపడుతోన్న కార్యక్రమాలపై ఆమె నివేదిక సమర్పించారు. అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాల ప్రాంగణంలో గవర్నర్‌తో కలిసి ఆమె మొక్కలను నాటారు. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా 8 మంది విద్యార్థులకు రాజ్యపురస్కారాలను అందించారు. కాగా, పీయర్స్ కన్స్ట్రక్షన్స్ ఎండీ అస్లాం బిన్ మహ్మద్ రూ.10 లక్షల విరాళం చెక్‌ను గవర్నర్‌కు అందజేశారు. కవిత కూడా రూ.5 లక్షలు అందించా రు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, కోశాధికారి రాజగోపాల్, జాయింట్ సెక్రటరీ మంచాల వరలక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ : కవాడిగూడలో అగ్నిప్రమాదం
-
ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఏడో తరగతి విద్యార్థి మహేశ్(12) కేసు మరో మలుపు తిరిగింది. మహేశ్ ఆత్మ హత్యకు పాల్పడడానికి ముందే తలపై బలమైన గాయమయిందని పోలీసలు తెలిపారు. స్కూల్ ఫీజు వేధింపుల వల్లే హైదరాబాద్‌లోని కవాడిగూడలో గల లిటిల్ ప్లవర్ హైస్కూల్ విద్యార్థి మహేశ్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం ఖండించింది. కాగా మహేశ్ ఆత్మ హత్యకు ముందే తలపై బలమైన గాయమయిందని పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్ట్‌లో వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోర్ట్‌మార్టం అనంతరం మృత దేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. జరిగిందేంటి కవాడిగూడ ప్రధానరోడ్డులోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో మహేశ్ 7వ తరగతి చదువుతున్నాడు. రోజులానే బుధవారం ఉదయమే నాగమణి పనికి వెళ్లింది. కొద్దిసేపటికే ఊరి నుంచి శ్రీనివాస్ ఇంటికి రాగా తాళం వేసి ఉంది. మహేశ్ వద్దనున్న తాళం చెవి కోసమని అతడు స్కూల్‌కు వెళ్లాడు.అయితే, మహేశ్ 2 రోజుల నుంచి స్కూలుకు రావడంలేదని ప్రిన్సిపాల్ చెప్పారు. ఇంటికి వెనుదిరిగి వచ్చేసరికి మహేశ్ టీవీ చూస్తూ కనిపించాడు. స్కూల్‌కు ఎందుకెళ్లలేదని తండ్రి మందలించగా ఫీజు కట్టాలని టీచర్లు అడుగుతున్నారని, అందుకే వెళ్లలేదని చెప్పాడు. కొద్దిసేపటికి బయటకు వెళ్లిన శ్రీనివాస్ తిరిగి ఇంటికి వచ్చేసరికి లోపల గడియపెట్టి ఉంది. తలుపులు పగులకొట్టి లోనికి వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు మహేశ్ వేలాడుతూ కనిపించాడు. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో చోరీ
హైదరాబాద్: నగరంలోని కవాడిగూడలో భారీ చోరీ జరిగింది. స్థానికంగా నివాసముంటున్న రిటైర్డ్ ప్రొఫెసర్ కైలాష్ ప్రసాద్ ఇంట్లో మంగళవారం రాత్రి దొంగలుపడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. 70 తులాల బంగారు ఆభరణాలతో పాటు పెద్ద మొత్తంలో నగదు చోరీకి గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. -
బాగు పడింది కేసీఆర్ కుటుంబం ఒక్కటే
కవాడిగూడ : ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దాలతోనే పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడితే మొదటి సీఎం దళితుడే అనే వాగ్దానం నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామనే వరకూ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదన్నారు. శుక్రవారం ఇందిరాపార్కులో సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ రాకముందు.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ వేర్వేరన్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చేసిన వాగ్దానాలన్నీ గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలకు ఏమీ ఒరగలేదనీ, కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ కాకుండా విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. కృష్ణయ్య మాట్లాడుతూ 770 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆ పోస్టులను భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కి అప్పగించడం సరైంది కాదన్నారు. పదేళ్లు పాఠాలు చెప్పడానికి పనికి వచ్చిన వారు ఉద్యోగం పర్మినెంట్ చేయడానికి పనికిరారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రజల నెత్తిన భస్మాసుర హస్తం పెడుతున్నాడన్నారు. తక్షణమే కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు స్వరూప, ఉమా, గాయత్రీ, నవీన, విక్టోరియా, అనీషా, రజనీ, కె.యాదయ్య, నరేందర్ పాల్గొన్నారు.