బాగు పడింది కేసీఆర్‌ కుటుంబం ఒక్కటే | KCR was the only one to bring the family | Sakshi
Sakshi News home page

బాగు పడింది కేసీఆర్‌ కుటుంబం ఒక్కటే

Published Fri, Aug 5 2016 10:13 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కృష్ణయ్య, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు - Sakshi

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కృష్ణయ్య, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు

కవాడిగూడ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ అబద్దాలతోనే పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడితే మొదటి సీఎం దళితుడే అనే వాగ్దానం నుంచి కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామనే వరకూ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదన్నారు. శుక్రవారం ఇందిరాపార్కులో సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ రాజగోపాల్‌ రెడ్డి, ఎమ్మెల్యే కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ రాకముందు.. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ వేర్వేరన్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తామని చేసిన వాగ్దానాలన్నీ గాలికి వదిలేశారని ఆరోపించారు.

ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలకు ఏమీ ఒరగలేదనీ, కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్‌ కాకుండా విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోమటిరెడ్డి బ్రదర్స్‌ అంటే భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. కృష్ణయ్య మాట్లాడుతూ 770 మంది కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్‌ చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆ పోస్టులను భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ కి అప్పగించడం సరైంది కాదన్నారు.

పదేళ్లు పాఠాలు చెప్పడానికి పనికి వచ్చిన వారు ఉద్యోగం పర్మినెంట్‌ చేయడానికి పనికిరారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రజల నెత్తిన భస్మాసుర హస్తం పెడుతున్నాడన్నారు. తక్షణమే కాంట్రాక్ట్‌  ఉపాధ్యాయులను పర్మినెంట్‌ చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు స్వరూప, ఉమా, గాయత్రీ, నవీన, విక్టోరియా, అనీషా, రజనీ, కె.యాదయ్య, నరేందర్‌ పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement