
ర్యాలీలో పాల్గొన్న చాడ వెంకట్‌రెడ్డి
కాచిగూడ: జీహెచ్‌ఎంసీలో అవినీతి రాజ్యమేలుతోందని, రోడ్ల నిర్మాణంలో జరిగిన కోట్లాది రూపాయల అక్రమాలే ఇందుకు నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. జీహెచ్‌ఎంసీలో జరిగిన అవినీతి, అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలని, నగరం రోడ్లకు వెంటనే మరమ్మత్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం ‘చలో జీహెచ్‌ఎంసీ’ పిలుపులో భాగంగా సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ... నగరంలో రోడ్ల దుస్థితి దారుణంగా తయారైందని, గుంటలమయమైన రోడ్లపై ప్రమాదాల బారిన పడి ప్రజలు మరణిస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైయినా లేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా సీపీఐ నేతలు ఇటి నరసింహ, గెల్వయ్య, ఎం.నర్సింహ, కమతం యాదగిరి, పోటు కళావతి, ఛాయాదేవి, శోభారాణి, రేణుక, వీఎస్ రాజు, విజయ్‌కుమార్, పాండురంగాచారి, శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.