
సాక్షి, హైదరాబాద్ : అక్రమ కట్టడాల నిర్మూలనలో జీహెచ్‌ఎంసీ విఫలమైందని ఆరోపిస్తూ.. సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ, జనసమితి అధ్యర్యంలో శనివారం జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. అక్రమ కట్టడాల నిర్మూలన విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దూసుకుపోతుంటే.. కేసీఆర్ మాత్రం నిద్ర పోతున్నారని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో 800 వరకూ చెరువులుండేవన్నారు. ప్రస్తుతం అవన్ని కబ్జాకు గురయ్యయన్నారు. జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాస్తూ జనాలకు నరకం చూపిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. చెరువుల పరిరక్షణ కోసం అన్ని పార్టీలతో కలిసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment