
తిరుపతికి డబుల్ డెక్కర్ రైలు ప్రారంభం
హైదరాబాద్లోని కాచిగూడ స్టేషన్ నుంచి తిరుపతి వెళ్లే డబుల్ డెక్కర్ రైలు బుధవారం ఉదయం ప్రారంభమైంది.
హైదరాబాద్లోని కాచిగూడ స్టేషన్ నుంచి తిరుపతి వెళ్లే డబుల్ డెక్కర్ రైలు బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఈ రైలు కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 6.45 గంటలకు బయల్దేరింది. తిరుపతికి సాయంత్రం 6.15 గంటలకు చేరుకుంటుంది. ప్రతి బుధ, శనివారాల్లో ఈ రైలు కాచిగూడ - తిరుపతి మధ్య తిరుగుతుంది. ఇప్పటికే గుంటూరు - హైదరాబాద్ మధ్య ఒక డబుల్ డెక్కర్ రైలు ప్రారంభం కాగా, ఇది మన రాష్ట్రానికి సంబంధించి రెండో రైలు అవుతుంది.
ఇది పూర్తిగా ఏసీ రైలు. ఈ రైల్లో ఎక్కడా బెర్తులు ఉండవు. చైర్ కార్ మాదిరిగా కూర్చుని మాత్రమే వీటిలో వెళ్లాల్సి వస్తుంది. మొత్తం పది బోగీలు ఉండే ఈ రైల్లో కింద, పైన కూడా సీట్లు ఉండటంతో ఒక్కో బోగీకి 120 మంది వరకు ప్రయాణికులు పడతారు. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉన్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు.