కాచిగూడ (హైదరాబాద్) : కాచిగూడ రైల్వే లాండ్రీలో పనిచేసే ఓ యువతి విధులకు వెళ్లి అదృశ్యమైంది. పోలీసుల కథనం మేరకు... కాచిగూడ నెహ్రునగర్ ప్రాంతానికి చెందిన పి.శంకర్ కూతురు పి.మౌనిక (20) పదవ తరగతి వరకు చదువుకుంది. కాచిగూడ రైల్వే లాండ్రీలో పనిచేస్తున్న ఆమె.. రోజు మాదిరిగానే శుక్రవారం రైల్వే లాండ్రీకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. మౌనిక ఆచూకీ లభించకపోవడంతో ఆమె తండ్రి శంకర్ శనివారం కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.