హైదరాబాద్ : మేనత్త ఇంటికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్‌పెక్టర్ కె.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... కామ్‌గార్‌నగర్ మున్సిపల్ క్వార్టర్స్ ప్రాంతానికి చెందిన నర్సింహ రాజు కుమార్తె జి.శిరీష (20) ఈ నెల 7వ తేదీన ఇంటినుంచి చిక్కడపల్లిలోని మేనత్త ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి అటు మేనత్త ఇంటికి వెళ్లలేదు, ఇటు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు తెలిసినవారి ఇళ్లలో, బంధువులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నా ఎక్కడా శిరీష ఆచూకీ లభించలేదు. దీంతో శిరీష అన్న సంతోష్ కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. కాచిగూడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.