కాచిగూడ (హైదరాబాద్) : ఓ మహిళ తన ఆరేళ్ల కుమార్తెతోపాటు హుస్సేన్‌సాగర్ నాలాలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ఇన్‌స్పెక్టర్ డి.రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణానగర్ ప్రాంతానికి చెందిన దీపక్, లక్ష్మి ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఆరేళ్ల మాలతి సంతానం. మత్తుకు బానిసైన లక్ష్మి కొంత కాలంగా మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తుండేది.
శనివారం ఉదయం మాలతితోపాటు లక్ష్మి గోల్నాక బ్రిడ్జి వద్ద హుస్సేన్‌సాగర్ నాలాలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మాలతిని గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. లక్ష్మి కోసం సాయంత్రం వరకు వెతికినా ఆచూకీ లభించలేదు. నీటి ప్రవాహంలో కోట్టుకు పోయి ఉంటుందన్న అనుమానాన్ని పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
కూతురు సహా తల్లి ఆత్మహత్యాయత్నం
Published Sat, Oct 10 2015 6:17 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement