
సాక్షి, హైదరాబాద్ : అధికారంలో కొనసాగాలని నిజాన్ని దాచిపెట్టిన టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ కార్పొరేటర్‌పై వేటుపడింది. కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల కన్నాచైతన్య ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు సంతానం కలిగి ఉన్నారని బీజేపీ మాజీ కార్పొరేటర్ ఉమాదేవీ భర్త రమేష్‌యాదవ్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు విచారణలో కన్నాచైతన్య తనకు ముగ్గురు సంతానం ఉన్నారన్న విషయాన్ని దాచిపెట్టినట్టు తేలింది. దీంతో ఆమెపై అనర్హత వేటువేస్తూ నాంపల్లి కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. రెండోస్థానంలో ఉన్న ఉమాదేవీ రమేశ్‌యాదవ్‌ను కార్పొరేటర్‌గా కొనసాగించాలని కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో ఉమా రమేశ్ కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌లో చేరిన రమేశ్‌యాదవ్.. ఎన్నికల అనంతరం ఆయన తిరిగి బీజేపీలో చేరడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment