కాచిగూడ: వావి వరసలు మరిచిన ఓ నీచుడు తమ్ముడి కూతురిపై లైంగికదాడికి పాల్పడాడు. సభ్యసమాజం తలదించుకొనే ఈ ఘటన కాచిగూడ ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ యు.శ్రీనివాస్ రెడ్డి కథనం ప్రకారం... కాచిగూడ లింగంపల్లి ప్రాంతానికి చెందిన జి.ఆనంద్ (50) టైలర్. పక్క ఇంట్లోనే ఉండే తమ్ముడి కుమార్తె (15)పై కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
దీంతో మనస్తాపం చెందిన బాలిక ఈనెల 14న ఇంటి నుంచి వెళ్లిపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆచూకీ తెలుసుకున్న పోలీసులు బాలికను స్టేషన్‌కు రప్పించి విచారించగా అసలు విషయం చెప్పింది. పెద్ద నాన్న తనపై అఘాయిత్యానికి పాల్పడటంతో తీవ్ర మనస్తాపం చెందానని, పైగా విషయం ఎవరికీ చెప్పలో తెలియక ఇంటి నుంచి వెళ్లిపోయానని తెలిపింది. పోలీసులు నిందితుడు ఆనంద్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో అతడ్ని అరెస్టు చేశారు.