
విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న హబీబుల్లాఖాన్
కాచిగూడ: మాదకద్రవ్యాలకు అలవాటు పడితే అది జీవితాన్నే నాశనం చేస్తుందని కాచిగూడ సీఐ హబీబుల్లాఖాన్ అన్నారు. డ్రగ్స్ వాడకంపై జరిగే అనర్థాలపై మంగళవారం కాచిగూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కాచిగూడ పోలీసులు అవగాహన కల్పిస్తున్న. డ్రగ్స్ వాడకంతో తలెత్తే పరిణామాలను సీఐ వివరించారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.