
నేను అసలు చీరలు ధరించను: నందిత
కాచిగూడ (హైదరాబాద్) : ప్రముఖ సినీనటి కుమారి నందితారాజ్ (శంకరాభరణం ఫేమ్) శనివారం హిమాయత్‌నగర్‌లో సందడి చేశారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం కామాక్షి సిల్క్స్ షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు. అక్కడి పట్టుచీరలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను అసలు చీరలు ధరించనని, అయితే కామాక్షి సిల్క్స్ వారు ఇచ్చిన చీర బాగుందని వేసుకున్నానని చెప్పారు.