కాచిగూడ (హైదరాబాద్) : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ బాలిక అదృశ్యమైంది. కాచిగూడ ఏఎస్‌ఐ మజార్ ఎండీ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం... గోల్నాక భాగ్యనగర్ ప్రాంతానికి చెందిన సి.శ్రీనివాస్,ఇందిర దంపతుల కూతురు భవాని(14) గత నెల 18వ తేదీన షాప్ దగ్గరకు వెళుతున్నానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఇన్నాళ్లుగా బంధువులను, తెలిసినవారి దగ్గర విచారించినా ఆచూకీ లభించకపోవడంతో బాలిక తల్లి ఇందిర మంగళవారం కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.