కాచిగూడ (హైదరాబాద్) : డెంగ్యూ జ్వరంతో ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన కాచిగూడలోని మున్నూరుకాపు హాస్టల్‌లో శనివారం జరిగింది. వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన నామాల అఖిల్(19) కాచిగూడలోని మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహంలో ఉంటూ తీగల కృష్ణారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వీతీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతడు మందులు వాడుతూ కాలేజీకి వెళ్లివస్తున్నాడు. కాగా పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృత్యువాతపడ్డాడు.